Header Banner

ఓరీ దేవుడా.. ఇంటిలోపలే దుస్తులు ఆరేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇకపై ఆ పని చెయ్యరు..

  Thu Feb 13, 2025 08:00        Health

బయట వాన పడుతున్నా లేక ఇంటి బయట స్థలం లేకపోయినా లోపలే దస్తులు ఆరేసుకుంటూ ఉంటాం. ఇది సాధారణ దృశ్యమే. ఈ అలవాటుతో ప్రమాదం ఉందని కూడా అనిపించదు. అయితే, ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇందుకు సంబంధించి ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంటిలోపల ఆరేసే దుస్తుల కారణంగా లోపలి వాతావరణం మారి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందట వైద్యులు చెప్పే దాని ప్రకారం, ఇంటి లోపల దుస్తులు ఆరేయడం వల్ల వాతావరణంలో తేమ పెరుగుతుందట. ఫలితంగా పంగస్ పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక్క లోడ్ లాండ్రీ నుంచి సుమారు 2 లీటర్ల నీరు గాల్లో కలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గాల్లో తేమ పెరిగి ఫంగస్ పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక కిటికీలు దర్వాజాలు సరిగా లేని గదుల్లో తేమ గోడలు, సీలింగ్స్, విండోలపై నీరు రూపంలో పేరుకుంటుంది. చివరకు ఆయా చోట్ల ఫంగస్ పెరగడం ప్రారంభమవుతుంది. బిల్డింగ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ హైలైట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఇంటిలోపల గాల్లో తేమ శాతం 60కి మించితే కచ్చితంగా ఫంగస్ పెరుగుదల మొదలవుతుంది.

 

ఇది కూడా చదవండి: క్యాన్సర్ కి దూరంగా ఉండాలా? అయితే వీటిని తినకండి! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

ఇంటిలోపల దుస్తులు ఆరేస్తే తేమ శాతం ఈ పరిమితికి మించి పెరుగుతుందని అధ్యయనకర్తు తేల్చారు. ఇంట్లో పెరిగే ఫంగస్ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలర్జీలు, ఇతర వ్యాధులు ఉన్నవారికి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఈ ఫంగస్ వెదజల్లే పూర్స్‌ను పీలిస్తే ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల బారినపడాల్సి వస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. స్పోర్స్ వల్ల కలిగే ఎలర్జీతో దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కంటి దురదు, చర్మంపై ర్యాష్‌లు వంటివన్నీ వస్తాయి. ఇక కొన్ని రకాల ఫంగస్‌ మైకోటాక్సిన్స్‌ అనే విషపదార్థాలను కూడా విడుదల చేస్తాయి. వీటితో నీరసం, తలనొప్పులతో పాటు రోగ నిరోధక శక్తి కూడా బలహీనమవుతుంది. చిన్నారులు, వృద్ధుల్లో ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇంట్లో దస్తులు ఆరేయకతప్పని సరిస్థితుల్లో డీహ్యూమిడిఫయ్యర్‌లు వాడితే సమస్య నుంచి కొంత వరకూ ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.


ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినా, గుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HealthCare #TIps #HotWaterBathing